ఇంట‌ర్ ఉత్తీర్ణులైన మ‌హిళా అభ్య‌ర్థుల‌కు టీచ‌ర్ పోస్టులు

రంగారెడ్డి జిల్లాలో 125 అంగ‌న్‌వాడీ టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయుట‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. తెలంగాణ రాష్ట్రంలో అంగ‌న్‌వాడి పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. దీనికోసం జిల్లాల వారీగా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా 7 ఐసిడిఎస్ ప్రాజెక్టు ప‌రిధిలో ఖాళీగా ఉన్న 125 టీచ‌ర్ పోస్ట‌ల‌కు ఇంట‌ర్ ఉత్తీర్ణులైన మ‌హిళా అభ్య‌ర్థున‌లు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్య‌ర్థులు 18 నుండి 35 ఏళ్ల వ‌య‌స్సు లోపు ఉండాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా స్థానిక మ‌హిళ అయి ఉండాలి. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 10.

జిల్లాలో ప్రాజెక్టుల వారీగా ఖాళీలు

ఆమ‌న‌గ‌ల్ – 31
చేవెళ్ల – 29
హ‌య‌త్ న‌గ‌ర్ -3
ఇబ్ర‌హీంప‌ట్నం- 21
మ‌హేశ్వ‌రం – 10
శేరిలింగంప‌ల్లి – 05
షాద్‌న‌గ‌ర్ – 26
ఎంపిక‌: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా స్థానిక మ‌హిళ అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోఅయితే అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలో .. ప‌ట్ట‌ణ ప్రాంతంలో అయితే సంబంధిత వార్డులో నివ‌సిస్తూ ఉండాలి.
స్థానిక‌త క‌లిగిన దివ్యాంగులు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వినికిడి ప‌రిక‌రాలు వినియోగించి విన‌గ‌లిగే వారు.. అంధ‌త్వం క‌లిగి ఇత‌రుల స‌హాయం లేకుండా విధులు నిర్వ‌ర్తించే సామ‌ర్ధ్యం క‌లిగిన‌వారు.. అంగ‌వైక‌ల్యం గ‌ల ప్రాథ‌మిక విద్యాబోధ‌న‌, పిల్ల‌ల‌ను సంరిక్షంచ‌గ‌ల మ‌హిళా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్ ద్వారా పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తుతో పాటు
విద్యార్హ‌త ద్రువీక‌ర‌ణ ప‌త్రం,
జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం,
కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం,
నివాస ధ్ర‌వీక‌ర‌ణ ప‌త్రం , (నోటిఫికేష‌న్ జారీ చేసిన నాటి నుండి ఒక ఏడాది లోపు తీసుకున్న నివాస ధ్రువీక‌ర‌ణ స‌ర్టిఫికెట్ మాత్రమే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.
అంగ‌వైక‌ల్యం గ‌ల వారు స‌ద‌రం స‌ర్టిఫికెట్,
అనాథ అయితే అనాధ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం,
వితంత‌తువు అయితే భ‌ర్త మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం జ‌త‌చేయాల్సి ఉంటుంది.

ఇంట‌ర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి.

ఇంట‌ర్లో వ‌చ్చిన మార్కుల‌కు 70%,

దివ్యాంగుల‌కు 5%,

వితంతువుల‌కు 5%,

అనాథ‌ల‌కు 10% వెయిటేజి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.