సంక్రాంతి ర‌ద్దీ.. మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ అన‌గానే సొంతూళ్ల‌కు వెళ్లేవారితో బ‌స్టాండ్‌లు, రైల్వే స్టేష‌న్లు ర‌ద్దీగా మారిపోతాయి. ఈ నేప‌థ్యంలో అధ‌నంగా ప‌లు రైళ్ల స‌ర్వీసుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా మ‌రో 11 ప్ర‌త్యేక రైళ్ల స‌ర్వీసుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ స‌ర్వీసులు జ‌న‌వ‌రి 7 నుండి 12వ తేదీ మధ్య న‌డ‌ప‌నున్నారు. తాజాగా ప్ర‌క‌టించిన రైళ్ల స‌ర్వీసులకు బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలిపారు.

రైళ్ల వివ‌రాలు:

కాకినాడ‌- వికారాబాద్‌,

వికారాబాద్‌- పార్వ‌తీపురం

పార్వ‌తీపురం-వికారాబాద్

పార్వ‌తీపురం-కాకినాడ టౌన్‌

సికింద్రాబాద్‌-పార్వతీపురం

కాకినాడ టౌన్-వికారాబాద్

 

నాచారం: బంగారం కోసం ఇంటి య‌జమాని హ‌త్య‌..

Leave A Reply

Your email address will not be published.