నాచారం: బంగారం కోసం ఇంటి య‌జమాని హ‌త్య‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): నాచారంలో బంగారం కోసం ఇల్లు అద్దెకు ఇచ్చిన య‌జ‌మానిని హ‌త్య జ‌రిగింది. నిందితుల‌ను నాచారం పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. పోలీసులు తెల‌పిన వివ‌రాల ప్ర‌కారం.. నాచారంలో పిఎస్ ప‌రిధిలోని మ‌ల్లాపూర్ బాబాన‌గ‌ర్‌లో సూరెడ్డి సుజాత ఉంటున్నారు. ఆమె భ‌ర్త‌, కుమారులు మృతి చెంద‌డంతో ఆమె ఒంట‌రిగా ఉంటున్నారు. అయితే, రెండు నెల‌ల క్రితం ఆమె ఇంట్లోకి క్యాబ్ డ్రైవ‌ర్ అంజిబాబు అద్దెకు చేరాడు. ఎపిలోని డా.బిఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా పెర‌వ‌లి మండ‌లం కొత్త‌ప‌ల్లికి చెందినవాడు.

ఈ నెల 19వ తేదీన అంజిబాబు య‌జ‌మాని సుజాతను హ‌త్య చేసి 11 తులాల బంగారం దోచుకెళ్లాడు. 20వ తేదీన అంజిబాబు స్నేహితుడు యువ‌రాజు, దుర్గారావు క‌లిసి మృత దేహాన్ని కారులో కోన‌సీమ జిల్లాలోని కృష్ణ‌లంక‌కు త‌ర‌లించి గోదావ‌రిలో విసిరేశారు. 24వ తేదీన సుజాత చెల్లెలు సువ‌ర్ణ‌లత సోద‌రి ఇంటికి వెళ్లి చూడ‌గా .. సుజాత క‌నిపించ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అంజిబాబు కూడా క‌నిపించ‌క‌పోవ‌డంతో.. అత‌నిని ప‌ట్టుకుని విచారించారు. దీంతో అంజిబాబు నేరం అంగీక‌రించాడు. అంజిబాబును తీసుకుని నాచారం సిఐ ధ‌నుంజ‌య ఆధ్వ‌ర్యంలో పోలీసులు గాలింపు చేప‌ట్టారు. ఎపిలోని డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా కు వెళ్లి సుజాత మృత‌దేహం కోసం గాలించారు. మామిడి కుదురు స‌మీపంలోని అప్ప‌న‌ప‌ల్లి-కె.ఏనుగుప‌ల్లి మ‌ధ్య వైన‌తేయ గోదావ‌రిలో సుజాత మృత‌దేహం ల‌భ్య‌మైంది.

 

మనసుకు శాంతి… ఆత్మకు వెలుగు ఇచ్చే వైకుంఠ ఏకాదశి

Leave A Reply

Your email address will not be published.