పరేడ్‌కు కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా..

న్యూఢిల్లీ : జ‌న‌వ‌రి 26న న్యూఢిల్లీలో జ‌రిగే రిపబ్లిక్‌ డే వేడుకలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించి ఈ ఏడాది వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఢిల్లీకి చేరుకున్న 150 మంది సైనికులకు కరోనా సోకినట్లు నిర్థారణకావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్‌డే పరేడ్‌ కోసం ఢిల్లీ చేరుకున్న వీరందరికీ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.
కాగా, ప్రతి ఏడాది వివిధ ప్రాంతాలకు చెందిన బెటాలియన్‌ల నుండి సైనికులు రిపబ్లిక్‌ డే వేడుకల కోసం ఢిల్లీ చేరుకుంటారు. దీంతో ఈ ఏడాది కూడా వేలాది మంది సైనికులు పరేడ్‌ కోసం నవంబర్‌ చివరి వారంలో ఢిల్లీ చేరుకున్నారు. అధికారులు ఆదేశాల మేరకు వీరందరికీ వైద్య పరీక్షలు చేపట్టారు. కరోనా నిర్థారణకావడంతో.. వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వీరి ప్రాథమిక కాంటాక్ట్‌లను గుర్తించే చర్యలు చేపట్టారు. రిపబ్లిక్‌ డేతో పాటు ఆర్మీడే పరేడ్‌ల కోసం వేలాది మంది సైనికులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారని, అయితే కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఎక్కువ మంది రాలేదని సంబంధిత అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.