నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న మంజీరా ప్రాజెక్టులో భాగంగా ఉన్న కలబ్‌గూర్ సబ్‌స్టేషన్‌లో 33 కేవీ అవుట్‌డోర్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ (VCB) ఏర్పాటు, నిర్వహణ పనులు బుధవారం చేపట్టనుంది.
బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. కావున ఈ రోజు 6 గంటలు కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయ కలగనుంది.
అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
ఆర్.సి.పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, హఫీజ్‌పేట్, మదీనాగూడ, మియాపూర్. బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ. బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీ, బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, హెచ్‌సీవై, ఇండస్ట్రియల్ ఏరియాలోని బల్క్ తాగునీటి కనెక్షన్లు. ఆఫ్‌టేక్ పాయింట్లు మరియు బల్క్ తాగునీటి కనెక్షన్లు.
తాగునీరు అంతరాయం కలిగే ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని జలమండలి విజ్ఞప్తి చేస్తుంది.
Also Read: పెన్సిలే కదా అని చులకన చేయకు..