రేపు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): రేపు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో తాగునీరు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంద‌ని జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. మంజీరా ఫేజ్-2 లోని కలాబ్ గూర్, పటాన్‌చెరులో 25 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో బుధ‌వారం ఉద‌యం 6 గంట‌ల నుండి మ‌రుస‌టి రోజు (గురువారం )రాత్రి 10 గంట‌ల‌కు వ‌ర‌కు తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.

అదే సమయంలో, అమీన్‌పూర్ ఎక్స్‌రోడ్ నుండి మాదీనగూడ వరకు పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీలను అరికట్టి, అవసరమైన చోట్ల ఎంఎస్ బ్యారెల్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపడుతున్నారు. కావున, 40 గంట‌లు కింది పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో త‌క్కువ ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా ఉంటుది. మ‌రికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుంది.

అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు:

ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్, బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు, ఎర్ర‌గ‌డ్డ‌ఎస్.ఆర్.న‌గ‌ర్అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్;

NEET 2026: నీట్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌

Leave A Reply

Your email address will not be published.