పురుషుల‌కూ ఫ్రీ బ‌స్సు సౌక‌ర్యం.. అన్నాడిఎంకె మేనిఫెస్టో

Free bus facility for men also - AIADMK manifesto

చెన్నై (CLiC2NEWS): త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల హామీల వ‌ర్షం కురుపిస్తున్నాయి. ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు విడుద‌ల చేశాయి. తాజాగా అన్నాడిఎంకె త‌న ఎన్నిక‌ల హామీల‌ను విడుద‌ల చేసింది. మ‌హిళ‌ల మాదిరిగానే పురుషుల‌కు కూడా ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కాన్ని తీసుకొస్తామ‌ని ప్ర‌కటించింది. అంతే కాక రేష‌న్ కార్డు క‌లిగిన కుటుంబాల‌కు ఉచితంగా ఫ్రిజ్ ఇస్తామ‌ని హామీ ఇచ్చింది. రూ.25వేల రాయితీతో 5 ల‌క్ష‌ల మంది మ‌హిళా ఉద్యోగుల‌కు ద్విచ‌క్ర వాహ‌నాలు, ప్ర‌తి కుటుంబానికి రూ.10 వేల ఆర్ధిక సాయం, సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను రూ.2 వేల‌కు పెంపు, రేష‌న్ కార్డుదారుల‌కు బియ్యంతో పాటు ఉచితంగా కిలో ప‌ప్పు, కిలో నూనె, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండ‌ర్లు, జ‌ల్లిక‌ట్లు యోధుల కుటుంబాల‌కు రూ. 10లక్ష‌ల ఆర్ధిక సాయం చేస్తామ‌ని హామీ ఇచ్చింది.

తెలంగాణ‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా రాఘ‌వులు దేవ‌ళ్ల‌

Leave A Reply

Your email address will not be published.