రైల్వే టికెట్ క్యాన్సిలేషన్‌పై కొత్తరూల్స్..
Indian Railways: రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో భారతీయ రైల్వే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఎవరైనా టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం రిఫండ్ చేసేలా కీలక మార్పులు చేసింది. ట్రైన్ బయల్దేరే సమయం ఆధారంగా టికెట్ సొమ్మును రిఫండ్ చేసే విధానాన్ని సవరించింది.
72 గంటల ముందు కన్ఫామ్ టికెట్‌ను క్యాన్సిలేషన్ చేసుకుంటే పూర్తి మొత్తం రిఫండ్ చేయనుంది. 72 గంటల నుండి 24 గంటల మధ్య టికెట్‌ను రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25% మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ట్రైన్ బయలుదేరే సమయానకి 24 గంటల నుండి 8 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50% ఫేర్‌ను మినహాయించి మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. ఒక వేళ ప్రయాణానికి 8 గంటల మందు గానీ, ఆ తర్వాత గానీ ఎవరైనా టికెట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే వారికి ఎలాంటి రిఫండ్ లభించదు.
ఈ మేరకు కొత్త రూల్స్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 మధ్య దశల వారీగా అమలుఉ చేయనున్నట్లు సమాచారం.