క‌విత కొత్త పార్టీ TRS (టిఆర్ఎస్‌)

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌విత కొత్త రాజ‌కీయ పార్టీని ప్ర‌కటించింది. శ‌నివారం మేడ్చ‌ల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో కొత్త రాజ‌కీయ పార్టీని ప్రక‌టించింది. `తెలంగాణ రాష్ట్ర సేన‌` గా పార్టీకి నామాక‌ర‌ణం చేశారు.
ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. “ఇవాళ నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజు.. తెలంగాణ రాష్ట్ర భ‌విష్య‌త్ రాసుకోవ‌డానికి మ‌నంద‌రి భాగ‌స్వామ్యం కావాలి. తెలంగాణ వ‌స్తే బానిస సంకెళ్లు పోతాయ‌ని భావించాం.. కాని రైతుల‌కు బేడీలు ప‌డ్డాయి. ఇసుక దందా వ‌ల్ల ద‌ళితులు దెబ్బ‌లుతిన్నారు.“

“అనాడు పాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. అందుకే కొన్ని విష‌యాల్లో సిగ్గుప‌డుతున్నా… తెలంగాణ ప్రజ‌ల‌ను క్ష‌మించాల‌ని కోరుతున్నా… తెలంగాణ సాధించినందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్నా… కానీ త‌ప్పులో భాగం ఉన్నందుకు క్ష‌మాప‌ణ చెబితే స‌రిపోద‌ని“ క‌విత అన్నారు.

నాటి టిఆర్ ఎస్ కోసం నా ర‌క్తం, చెమ‌ట ధార పోశా..

“నాటి టిఆర్ ఎస్ కోసం నా ర‌క్తం, చెమ‌ట ధార పోశా.. అనాటి కెసిఆర్ వేరు.. ఇవాళ్టి కెసిఆర్ మారిన మ‌నిషి.. మ‌ర మ‌నిషి.. మ‌న మ‌నిషి కాదు.. ఎందుకంటే గుంట న‌క్క‌లు, తోడేళ్ల చేతిలో కెసిఆర్ ఖైదీ అయ్యార‌ని“ అన్నారు.

తెలంగాణ నుంచి 7 మండ‌లాలు లాక్కుంటే భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీలు మాట్లాడ‌టం లేద‌ని క‌విత అన్నారు. సామాజిక న్యాయానికి బ‌ద్ద వ్య‌తిరేకి బిజెపి అని క‌విత ఆరోపించారు. మూడు పార్టీల‌పై అలుపు ఎర‌గ‌ని పోరాట‌నికి కార్య‌క‌ర్త‌లంతా సిద్ధం కావాల‌ని ఈ సంద‌ర్భంగా క‌విత పిలుపును ఇచ్చారు.

Also Read:  ‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..

Leave A Reply

Your email address will not be published.