‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..

Ghost Cycle: ఓ యువ ఆవిష్క‌క‌ర్త ‘అదృశ్య వ్య‌క్తి’ న‌డిపే సైకిల్ ను త‌యారు చేశాడు. గుజ‌రాత్‌లోని సూర‌త్ న‌గ‌రానికి చెందిన శివ‌మ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్‌'(Ghost Cycle)ను రూపొందించాడు. ఇంతకు ముందు గ‌రుడ్ ఏఐ బైకు, సింగిల్ టైర్ స్కూట‌ర్, రోబోటిక్ రిక్షా వంటివి ఆవిష్క‌రించాడు. తాజాగా త‌న స‌హ‌చ‌రుడుతో క‌లిసి మూడు నెల‌ల్లో ఘోస్ట్ సైకిల్ రూపొందించాడు.  ఈ సైకిల్‌ను అదృశ్య వ్య‌క్తి న‌డుపుతున్న‌ట్లు ఉంటుంది. మ‌నిషికాళ్లు పెడ‌ల్స్ తొక్కుతూ క‌నిపిస్తుంది. కాని మొండెం త‌ల ఉండ‌దు. ఓ అదృశ్య వ్య‌క్తి సైకిల్ తొక్కుతున్నాడా .. అనిపిస్తుంది. సూర‌త్ న‌గ‌ర ర‌హ‌దారుల‌పై ఈ సైకిల్ త‌నంత‌ట తానే బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంటే చూసిన జ‌నమంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా దీనిని ఆప‌రేట్ చేస్తారు. ఏఐ మోడ్ ద్వారా సైకిల్ ముందుగా నిర్ణ‌యించిన మార్గంలో ప్ర‌యాణించే సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఎదురుగా వ‌చ్చే వాటిని సైకిల్‌లో అమ‌ర్చిన సెన్స‌ర్ల సహాయంతో గుర్తించి, మార్గాన్ని నియంత్రిస్తుంది. దీని త‌యారీకి రూ,35వేలు ఖ‌ర్చ‌యిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.