రేపు మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో రేపు (ఈ నెల 29వ తేదీ) పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 23వ తేదీతో పూర్తయ్యింది. దీంతో రేపు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది మార్చి 14 నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారుగా 5 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.