Kamareddy: రూపాయికే కంటి పరీక్షలు
కామారెడ్డి (CLiC2NEWS): పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఆప్టికల్ హబ్ ను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతామని, ఏదైనా సాధించగలమని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. కస్టమర్లకు ఒక్క రూపాయికే సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. వ్యాపార దృక్పథం కాకుండా సేవా భావంతో సేవలు చేసి మరింత ముందుకు వెళ్లాలని వ్యాపారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి, నిర్వాహకులు బుస్స శ్రీనివాస్, రోహిత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
More Read: మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం.