విశాఖలో దారుణం.. బంగారం కోసం మహిళ హత్య..
విశాఖ (CLiC2NEWS): నగరంలో దారుణం చోటుచేసుకుంది. బంగారు ఆభరణాల కోసం మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. అక్కయ్య పాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో ఓ మహిళను కాళ్లు, చేతులు కట్టేసి, బీరువా తాళాల కోసం చిత్ర హింసలు పెట్టారు. బాధిత మహిళ హైదరాబాద్ నుండి బుధవారమే నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఓ పనిమనిషి విశ్రాంత ఐపిఎస్ భార్యను హత్య చేసి నగలు డబ్బులతో పరారైన ఘటన మరువకముందే మరో మహిళ హత్యకు గురవడం కలకలం రేపుతుంది.