అతని గానానికి ఫిదా.. గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం..
గాంధీ నగర్ (CLiC2NEWS): ఓ భజన కార్యక్రమంలో జానపద గాయకుడు ఆలపించిన గానానికి అభిమానులు ఫిదా అయి అతనిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. ఈ ఘటన గుజరాత్లో జునాగఢ్‌లోని ఖంభాలియా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రముఖ గుజరాతీ జానపద గాయకుడు గోపాల్ సాధు గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా గోపాల్ సాధు పాటలు ఆలపించారు. ఆయన గాత్రానికి మంత్ర ముగ్ధులైన అభిమానులు సాధుపై డబ్బులు సంచులతో కుమ్మరించారు. కరెన్సీ నోట్లతో అతను మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
View this post on Instagram