యుపిలో అకాల వర్షాలు.. 89 మంది మృతి
లఖ్‌నవూ (CLiC2NEWS): ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర గాలులతో కూడిన అకాల వర్షాలు కారణంగా 89 మంది మృత్యువాత పడ్డారు. మండు వేసవిలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. క్యుములోనింబస్ ప్రభావంతో మే 13వ తేదీన ఈదురు గాలులు, వడగళ్ల వాన, పిడుగులతో కూడిన వర్షం ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో 89 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 53 మంది గాయపడినట్లు సమాచారం. ఈ వర్షానికి జంతువులు సైతం మృత్యువాతపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ప్రయాగ్ రాజ్‌లో 21 మంది ఫతేపుర్‌లో 11 మంది, సంత్ రవిదాస్ నగర్లో 14 మంది, భదోహిలో 16 మంది, మీర్జాపుర్‌లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం.