మహబూబాబాద్: మహిళా దొంగల ముఠా అరెస్టు
మహబూబాబాద్ (CLiC2NEWS): పట్టణంలో మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో ఇటీవల పలు ప్రాంతాల్లో నగదును అపహరించిన కేసులు నమోదు కాగా.. ఆ కేసులకు సంబంధించిన ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులు తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లి పుంత గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
ఈ నెల 25వ తేదీన మహబూబాబాద్ పట్టణంలోని గిరిప్రసాద్ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ టిజిబివిబి బ్యాంకు నుండి రూ.46 వేల నగదు డ్రా చేసి.. నెహ్రూ సెంటర్‌లోని ఇండియన్ బ్యాంకు లో తన ఖాతా వివరాలు తెలుసుకుంటుంది. అదే సమయంలో నలుగురు మహిళలు అక్కడే తిరుగుతూ, ఆమెను మాటల్లో పెట్టి నగదును అపహరించారు. మరో చోట ఈ నెల 23వ తేదీ న ఆర్‌టిసి బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిళ నుండి రూ.5వేల నగదును కాజేసినట్లు అందిన పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టైన వారిపై గతంలోకూడా పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.