దేశంలో భారీగా తగ్గిన కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 18,177 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది. ఇందులో 99,27,310 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,44,220 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 217 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,49,435కి చేరింది.