ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీకొని ఏడుగురు మృతి

సూర‌త్ (CLiC2NEWS): గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లాలో రెండు ఆర్‌టిసి బ‌స్సులు ఢీకొని ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. మ‌రో 40 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్ జిల్లా బ‌ర్డోలి ప్రాంతంలో చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం సాయంత్రం బ‌ర్డోలి వ‌ద్ద ట్రాక్ట‌ర్‌ను త‌ప్పించ‌బోయి డివైడ‌ర్‌ను దాటి ఎదురుగా వ‌స్సున్న బ‌స్సును ఢీకొన‌డంతో ఈ ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బ‌స్సులు మ‌హారాష్ట్రకు చెందిన‌వే.  మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌మాద స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఈ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న ప్ర‌ధాని మోడీ విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రులు త్వ‌రగా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.