ప్రపంచ పర్యావరణ దినోత్సవం
పచ్చని ప్రకృతి – మన భవిష్యత్తు -మంజుల పత్తిపాటి.
ఒకప్పుడు
పక్షుల కిలకిలారావాలతో మేల్కొన్న ఉదయం..!
ఈ రోజు మొబైల్ ఫోన్ల అరుపులతో తడబడుతోంది.
ఉదయం..!
మనిషి అభివృద్ధి పేరుతో అడవులు నరికేస్తే..
రేపటి పిల్లల చేతుల్లో పుస్తకాలు కాదు
ఆక్సిజన్ బాటిళ్లను మోయవలసి వస్తుంది..!
ఒకప్పుడు
చెట్టు నీడలో కూర్చుని తల్లి జోలపాట పాడేది…
కాని ఇప్పుడు
నరికిన చెట్ల రక్తం తో మనిషి వేసిన కాంక్రీట్ గోడల మధ్య
ఊపిరాడక బంధీలైపోవలిసి వస్తుంది..!
ప్రకృతిని జయించాను అని అనుకొన్న మనిషి
చివరికి..
ఒక నీటి బొట్టుకోసం ఆకాశం వైపు
చేతులు చాచే రోజులు ఎంతో దూరంలో లేవు..!
మనిషి చేతుల్లో ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఉన్నాయి
మట్టివాసనను తాకే వేళ్లు లేవు..!
ఎయిర్‌కండిషన్ గదుల్లో
ఊపిరాడక చనిపోతోన్న సమయాన..
డబ్బు కట్టలు పట్టుకుని
మనిషి ఒక ఆక్సిజన్ చుక్క కోసం
ప్రకృతి దేవుడిని వేడుకుంటాడు
కానీ… నాకూ యోగ్యత
లేదు అని తెలుసుకోలేకపోయాడు..!
కాంక్రీట్ అడవుల్లో మునిగిపోయిన
మనిషి చెవులకు చెట్ల నుంచి వచ్చిన
మధుర రాగాలు వినే యోగ్యత
లేదు అని తెలుసుకోలేకపోయాడు..!
ఆకుపచ్చ భూమి ఆర్తనాదం..
ఎండిపోయిన నదుల గుండె చప్పుడు..
విని పలికిన ప్రతి మాటలో
మట్టివాసన గొప్పతన్నాన్ని
మనిషి చెవుల్లో నాటుతుంది
మంజుల పత్తిపాటి..!
నరికిన చెట్ల నీడల్లో..
చెదిరిన పక్షుల గూటిల్లో..
ప్రకృతి బాధను
కన్నీటి చుక్కగా కాదు,
అగ్నిజ్వాలగా రాసే స్వరం
మంజుల పత్తిపాటి..!
ఒక మొక్క నాటడానికి..
ఒక నదిని కాపాడడానికి..
ఒక పక్షి గూటిని నిలబెట్టడానికి..
మన శ్వాసను నిలుపుకోవడానికి..
ఇంకా సమయం ఉంది…!
ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పచ్చని భూమి మన అందరి బాధ్యత.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
-మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
చరవాణి 9347042218.