ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్న ఏకే గోస్వామి
అమరావతి : ఎపి హైకోర్టు సిజెగా జస్టిస్ అరూప్ గోస్వామి బుధవారం ప్రమాణం చేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. కార్యక్రమం అనంతరం తేనీటి విందు జరుగుతుంది.