డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వ్యక్తికి ఏడు రోజుల జైలు..
రామగుండం (CLiC2NEWS): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి . రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని ప్రిన్సిపల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని, వెంకట్ సచిన్ రెడ్డి గారి ముందు హాజరుపరుచగా.. ఐదుగురి కి 55,000 రూపాయల ఫైన్ వేయడం జరిగింది. మరొక వ్యక్తి కి 7 రోజుల జైలు శిక్ష విధించారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సీఐ గారు మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు .అంతే కాక వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రాంగ్ రూట్లో వెళ్లరాదని , ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాన్ని అతివేగంగా నడపరాదని సిఐ తెలియజేశారు.