`ఆచార్య` టెంపుల్ టౌన్ అదుర్స్.. వీడియో షేర్ చేసిన చిరు
ఆచార్య సినిమాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్ లో నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా హైదరాబాద్ కోకాపేట్ శివారులో వేసిన సెట్ లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ కొరటాల శివ టెంపుల్ టౌన్ ను సృష్టించాడు. ఈ టెంపుల్‌టౌన్‌పై తీసిన వీడియోను చిరంజీవి ట్విటర్ లో షేర్ చేశాడు.
‘ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ టౌన్ సెట్ 20 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. అందులో భాగంగా గాలిగోపురం.. ప్రతీ చిన్న చిన్న విషయాలను కూడా అద్బుతంగా మలిచారు.. ఇది కళాదర్శకత్వ ప్రతిభకే ఓ మచ్చుతునక. నాకెంతో ముచ్చటనిపించి నా కెమెరాలో బంధించి..మీతో పంచుకోవాలనుకున్నా. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా..? అనేంతగా టెంపుల్ డిజైన్ చేసిన కళాదర్శకుడు సురేశ్‌ను, టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన కొరటాల శివను, దీన్ని ఇంత అపూర్వంగా నిర్మించడానికి కావాల్సినవి సమకూర్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ లను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని` మెగస్ఠార్ వీడియోలో అన్నారు.
The amazing #TempleTown set built for #Acharya is a real piece of Art. Couldn’t stop sharing it with you all. pic.twitter.com/P4psg5TDVn
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 6, 2021