Nandyal: జిల్లాలో 70 అంగ‌న్‌వాడి పోస్టులు

 

నంద్యాల (Nandyal) జిల్లాలో 6 ఐసిడియ‌స్ (ICDS) ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 70 అంగ‌న్‌వాడీ  పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.  ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన మ‌హిళా అభ్య‌ర్ధులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 18వ తేదీలోపు పంపిచాల్సి ఉంది. 21 నుండి 35 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్నవారు అంగ‌న్ వాడీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫ్‌లైన్‌లో ద్వారా పంపించాలి.

నంద్యాల Nandyal జిల్లాలో స్త్రీ , శిశు అభివృద్ది, సాధికారత కార్యాల‌యం (WCDW) ప‌రిధిలోని 6 ఐసిడియ‌స్ (ICDS) ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగ‌న్‌వాడీ పోస్టుల‌ను ఒప్పంద‌ ప్ర‌తిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు.

మొత్తం పోస్టులు 70:

మెయిన్ అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు – 3

అంగ‌న్‌వాడీ ఆయాలు – 67

అర్హ‌త : 10వ త‌ర‌గతి ఉత్తీర్ణ‌త ఉండాలి. అభ్య‌ర్థులు 21 ఏళ్లు నిండిఉండాలి. ఎస్ టి , ఎస్‌సి ప్రాంతాల్లో 21 ఏళ్ల వారు లేకుంటే 18 ఏళ్లు నిండిన వారు కూడా అర్హులే. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా స్థానికులై ఉండాలి. వివాహితురాలై ఉండాలి.

ఎంపిక‌: మెరిట్ , అర్హ‌త‌ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు తో పాటు జ‌త చేయ‌వ‌ల‌సిన ఇత‌ర ప‌త్రాలు:

జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌

కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

స్థానిక నివాస స్థ‌ల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

అధార్‌, రేష‌న్ కార్డ్

వితంతువులు లేదా దివ్యాంగులైతే సంబంధిత స‌ర్టిఫికెట్లు జ‌త‌చేయాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.