అంత‌ర్జాతీయ అక్ష‌రాస్య‌తా దినోత్సవం

అంత‌ర్జాతీయ అక్ష‌రాస్య‌తా దినోత్సవం:

1967 వ సంవ‌త్స‌రం నుండి యునెస్కో ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌ర్ 8వ తేదీన అంత‌ర్జాతీయ అక్ష‌రాస్య‌తా దినోత్సవం జ‌రుపుకుంటున్నారు. ఇది అక్ష‌రాస్య‌త ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తుంది. చ‌ద‌వ‌డం, రాయ‌డం ప్ర‌తి వ్య‌క్తి యొక్క ప్రాథ‌మిక హ‌క్కుగా, వ్య‌క్తిగ‌త , సామాజిక అభివృద్ధిలో కీల‌క భాగం. ఇది కేవ‌లం పిల్ల‌ల‌కు మాత్ర‌మే కాకుండా వ‌యోజ‌న విద్య మీద కూడా కేంద్రీక‌రించ‌బ‌డింది.

1966లో జ‌రిగిన 14 జ‌న‌ర‌ల్ కాన్ఫ‌రెన్స్ స‌మావేశంలో యునెస్కో ప్ర‌కటించింది. అంత‌ర్జాతీయ అక్ష‌రాస్య‌త దినోత్స‌వం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి సెప్టెంబ‌ర్ 8, 2026.. 60వ అక్ష‌రాస్య‌త వార్షికోత్స‌వం. ఈ 2026 సంవ‌త్స‌రం ప్ర‌జ‌లు, గ్ర‌హం మ‌రియు శ్రేయ‌స్సు కోసం అక్ష‌రాస్య‌త అనే ఇతివృత్తంతో జ‌రుపుతున్నారు. అంటే వేగంగా మారుతున్న ప్ర‌పంచంతో సాధించిన పురోగ‌తిని స‌మీక్షించ‌డానికి కొత్త‌గా ఎదుర‌వ‌తున్న స‌వాళ్ల‌పై అవ‌గాహ‌న పెంచ‌డానికి, భ‌విష్య‌త్ అక్ష‌రాస్య‌త వ్యూహాల‌ను రూపొందించ‌డానికి అవకాశం అందిస్తుంది.

యునెస్కో..2026 సెప్టెంబ‌ర్ 8మ‌రియు 9 తేదీల‌లో ఈ అక్ష‌రాస్య‌త వేడుక‌ల‌ను మెక్సికో లో నిర్వ‌హించ‌నున్నారు. శాంతియుత‌మైన , సుస్థిర‌మైన స‌మాజాల‌కు మ‌ద్ద‌తుగా.. అంద‌రికీ అక్ష‌రాస్య‌త‌ను ప్రొత్స‌హించే ల‌క్ష్యంతో స‌మ‌ర్ధ‌వంత‌మైన విధానాలు, పద్ధ‌తులు మ‌రియు భాగ‌స్వామ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి ఇది ఒక వేదిక కానుంది.

 

ప్ర‌పంచంలో చాలా దేశాలు వెన‌క‌బ‌డి ఉండ‌టానికి నిర‌క్ష‌రాస్య‌త కార‌ణం. అక్ష‌రాస్య‌తా దినోత్స‌వం యొక్క ముఖ్య ఉద్దేశం అక్ష‌రాస్య‌త‌ను వ్య‌క్తులు , సంఘాల‌కు అందిచ‌డం. అంత‌ర్జాతీయ అక్ష‌రాస్య‌త దినం .. వివిధ దేశాల‌లో అంద‌రికీ విద్య‌.. అనే నినాదంగా ల‌క్ష్యాల‌ను చేరుకునే విధంగా ప్ర‌య‌త్నిస్తోంది.

యునెస్కో 1990 సంవ‌త్స‌రాన్ని అక్ష‌రాస్య‌తా సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించింది. అంతేకాక‌.. 2003-2012 ద‌శాబ్ధాన్ని ఐక్య‌రాజ్య స‌మితి అక్ష‌రాస్య‌తా ద‌శాబ్దంగా ప్ర‌క‌టించింది. ప్ర‌పంచంతో పోలిస్తే భార‌త‌దేశం అక్ష‌రాస్య‌త‌లో ఇంకా వెనుక‌బ‌డే ఉంది. ఇంకా మ‌న‌దేశంలో కొన్ని ప్ర‌దేశాల్లో నిర‌క్ష‌రాస్య‌త క‌నిపిస్తూనే ఉంటుంది. స్థిర‌మైన ఆర్ధికాభివృద్ది సాధించాలంటే మ‌న దేశంలో 80% అక్ష‌రాస్య‌త సాధించాల్సి ఉంది.

ప‌లు రాష్ట్రాల్లోని గ్రామాల్లో నిరక్ష‌రాసులు ఉన్నారు. వ‌యోజ‌నులే కాకుండా పిల్ల‌లు కూడా అక్ష‌ర జ్ఞానానికి నోచుకోవ‌డం లేదు. ఆర్ధిక ఇబ్బందుల వ‌ల్ల‌నే కాకుండా ప్ర‌భుత్వాలు అందిస్తున్న ప‌థ‌కాలు కూడా వారికి అంద‌క పోవ‌డం కార‌ణాలు కావ‌చ్చు. కొన్ని గ్రామాల్లో పాఠ‌శాల‌లు ఊరికి దూరంగా ఉండ‌టం, పాఠ‌శాల‌ల్లో వ‌స‌తులు స‌రిగా లేక‌పోవ‌డం వంటివి కూడా కార‌ణాలు. త‌ల్లిదండ్రుల‌తో పాటు పిల్ల‌లు కూడా కూలీ ప‌నుల‌కు వెళితే నాలుగు డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌ల‌తో పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంప‌డంలేదు. స్కూల్స్ దూరంగా ఉండ‌టం కూడా ఒక ర‌క‌మైన కార‌ణం .
కొన్ని గ్రామాల్లో అయితే ఒక‌టి నుండి ఐద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కే అక్క‌డున్న పాఠ‌శాల‌ల్లో బోధిస్తారు. త‌ర్వాత త‌ర‌గ‌తులు చ‌ద‌వుకోవాలంటే కొన్ని కిలోమీట‌ర్ల దూరం వెళ్లాల్సి వ‌స్తుంది. దీంతో అక్క‌డితోనే చ‌దువును ఆపేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు క‌ష్ట‌ప‌డి వేరే ఊరెళ్లి చ‌దివిన వాళ్లు.. ఊరికేదో చేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా స‌ఫ‌లం కావ‌డంలేదు. దానికోసం ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి. ఎంత మంది ప్ర‌భుత్వ అధికారుల‌ను ఒప్పించాలి.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు చైత‌న్య‌వంతుల‌వుతున్నారు. విద్య యొక్క ప్రాముఖ్య‌తను తెలుసుకుంటున్నారు. తాము కూలీ ప‌ని చేసైనా త‌మ పిల్ల‌ల‌ను చ‌దివించాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నారు. త‌మ పిల్ల‌లు త‌మ‌లాగా కాకుండా ఉన్న‌త స్థాయిలో ఉండాల‌ని ఆశ ప‌డుతున్నారు. రానురాను చ‌దువుకునే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.

Also Read: Nandyal: జిల్లాలో 70 అంగ‌న్‌వాడి పోస్టులు

Leave A Reply

Your email address will not be published.