SSC: ఇంటర్ అర్హతతో 2 వేల కేంద్ర ప్రభుత్వ కొలువులు
SSC: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ కొలువులు సాధించే సువర్ణావకాశం. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునల్ మొదలైన వాటిలో విధులు నిర్వర్తించవచ్చు.
లోయర్ డివిజినల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 7. దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఈ పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్(CHSL) 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు 2,536
లోయర్ డివిజినల్ క్లర్క్ (ఎల్‌డిసి), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
పైన తెలిపిన పోస్టులకు రూ. 19,900 నుండి రూ. 63,200 వరకు వేతనం అందుకోవచ్చు..
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (డిఇఒ)
ఈ పోస్టులకు నెలకు వేతనం రూ. 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్స్(గ్రేడ్ -ఎ)
ఈ పోస్టులకు రూ.29,200 నుండి 92,300 వరకు వేతనం వస్తుంది.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత. డిఇఒ ,గ్రేడ్ -ఎ, గుర్తింపు పొందిన బోర్డు లేదా తల్సమానం నుండి మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ స్టైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: అక్టోబర్ 2026 నాటికి 18నుండి 27 వయస్సు మధ్య ఉండాలి. ఆగస్టు 2, 1999 నుండి ఆగస్టు 1,2008 మధ్య జన్మంచి ఉండాలి. ఎస్సి, ఎస్టి, ఒబిసిలకు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
టైర్1, టైర్-2 పరీక్షలు ఉంటాయి. ఇది అర్హత పరీక్ష.
టైర్-1 పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలుఉంటాయి.
జనరల్ ఇంటిలిజెన్స్ 25 ప్రశ్నలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు
జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు
టైర్ -2 పరీక్షలకు మొత్తం 405 మార్కులు ఉంటాయి.
మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ సబ్జెక్టులో ప్రశ్నలు ఉంటాయి.
ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.