ఔటర్ రింగురోడ్డుపై ఇన్నోవా కారు, కంటైనర్ ఢీ
హైదరాబాద్: రాజేంద్రనగర్ దగ్గర ఔటర్ రింగ్‌రోడ్డుపై ఇన్నోవా కారు ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ప్రమాద ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఇన్నోవాకారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వెళ్తున్న క్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై వెళ్తున్న కంటైనర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. పోలీసులు ఘక్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. పోలీసలు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.