షేక్.బహర్ అలీ: అందమైన పెదవులపై.. చిరు వ్యాయామం
పెదవులు పగలటానికి కారణం విటమిన్ ఎ,విటమిన్ బి ,లోపాలు.చలి గాలి, రుతువులలో మార్పు,గాలి వేగంగా వీచటం,అనేక కారణాలు ఉంటాయి.ఇవే కాకుండా కరకరలాడే పదార్దాలు ,కారం ఎక్కువ వున్న,మసలాలతో కూడిన వేడి భోజనం ,పొగ తాగటం వలన,వీటి వల్లన కూడా ప్రతికూల ప్రభావం వుంటుంది.ఇవి పెదవులు పగులుటకు కారణం అవుతాయి.ఈ సమస్యకు ఆయుర్వేద చికిత్సతో పాటు ప్రాకృతిక సంరక్షణ కూడా అవసరం అవుతుంది
ప్రాకృతిక సంరక్షణ
- ఆకు కూరలు, వెన్నె,,పాలు, ఆహారం తీసుకోవాలి.విటమిన్ ఎ,బి, లోపాలు నివారిస్తాయి.సోయాబీన్ అలాగనే రకరకాల పప్పులు,కూడా ఈ లోటుని నివారించి పెదవులు పగిలే సమస్యను నివారిస్తాయి.
- రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా వెన్నె తీసుకుని పెదవులకు రాస్తే, పెదవుల చర్మం మృదువుగా ఉంటాయి.పెదవులు పగలవు.
- మూడు లేదా 4 చుక్కలు గ్లిజరిన్ గులాబీ నీటితో కలిపి ఉంచుకొని పెదవులపై 3 సార్లు పెట్టుకోవచ్చును.
- పొడి గాలి వలన పెదవులు పగిలితే రాత్రి పదుకునే ముందు స్వచ్ఛమైన అవ నూనెను గోరువెచ్చగా చేసి పేదవులపైన రాయాలి.బొడ్డులో రెండు చుక్కలు వేయాలి.
శీతాకాలము శరీరానికి చలి ఎక్కువగా ఉంటుంది.కానీ పెదవులు ఎక్కువగా సున్నితంగా ఉండుట వలన వాటిపై శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.శీతాకాలం రాగానే పెదవులు పగులుతాయి.పెదవులు పగలటం వలన నవ్వలేము, ఏడ్వలేము, మాట్లాడలేము, అన్నం సరిగ్గా తినలేము,టీ తాగలేము,కష్టంగా ఉంటుంది.పెదవులు స్వయంకృత ప్రజ్ఞాపరాధన వలన పగులుతాయి (అశ్రద్ధ).పెదవులు పగిలి చర్మం నుండి రక్తం రావటం కూడా జరుగుతుంది.
- పెదవులపై పొర లేచినపుడు రాత్రి పడుకునే ముందు పెదాలపై బాదం నూనె రాసుకుని నిదురించాలి. పెదవులు మృదువుగా అవుతాయి.పెదవులను గోకటం కానీ పళ్ళతో కొరకటం కానీ చేయరాదు.
- నల్లగా మారిన పెదాలకు గులాబీ జలంలో గ్లిజరిన్ కలిపి పెదలపైన రోజు రాయాలి.
- చూపుడు వేలు ముందు భాగాన్ని పెదవుల కొనలపై ఉంచి లోపలి వైపు మాలిష్ చేయాలి.
- చూపుడు వేలు ముందు భాగాన్ని పెదవులపై ఉంచి గడియారం ముళ్ళు తిరిగే దిశలో మరియు వ్యతిరేక దిశలో కూడా మాలిష్ చేయాలి.
- నవ్వే సమయంలో విచ్చుకున్న భాగాన్ని చూపుడు వ్రేలితో లోపలి వైపు నిదానంగా మాలిష్ చేయాలి.
- పెదవులపై వెన్న,పంచదార రాసిన మంచిగా వుంటాయి.
- ఎండ వలన పెదవులు నల్లబడతాయి.వారికి తగిని ఆయుర్వేదిక్ ముందుకు వాడాలి.
- పెరుగు,మీగడ,కుంకుమపూవ్వు,పెదలపైన రాసుకుంటే ఆరోగ్యముగా ఉంటాయి.పెడవులపైన మృతకణాలు పోతాయి.
- చక్కని ఆయుర్వేద మెడిసిన్ డాక్టర్ సలహా మేరకు లవంగా తైలం పెదలపైన రాయండి.తేనే,గులాబీ జలం చాలా రకముకల ఆయుర్వేద మందులు వున్నాయి. వైద్యుడి సలహా మేరకు వాడండి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు