షేక్.బహర్ అలీ: అర్ధకటి చక్రాసనం

అర్ధకటి చక్రాసనం.. చేయువిధానం:

1. ముందుగా కాలకృత్యములు చేసుకొని ఓక గ్లాస్ నీరు తాగిన తరువాత 10 నిమిషాలు వ్యవధి ఇవ్వండి.

2. ఇప్పుడు రెండు పాదాలు దగ్గరగా పెట్టి ఆసన స్థితిలో నిటారుగా నిలబడి, రెండు అర చేతులు తొడలకు బాహ్య భాగమున (పార్శ్వ) అనించి ఉంచవలెను.

3. ఉచ్వాసనిశ్వాలు యధా విధిగా ఉండాలి.

4. ఇప్పుడు రెండు పాదాలు దగ్గరగా ఉంచి,రెండు అర చేతులు కింద తొడల వద్ద ఆనించి, వెన్నుముక స్ట్రెయిట్ గా ఉంచి, చూపు భూమికి సమాంతరంగా ముందు వైపుకు చూస్తూ ఉండాలి.

5. ఇప్పుడు ఊపిరి పీల్చుచు,కుడి చెయ్యి చెవికి తగులు వరకు తల ప్రక్కగా పైకెత్తుము.అర చెయ్యి ఎడమ వైపునకు తిరిగి ఉండవలెను.

6. ఊపిరిని వదులుచు , నెమ్మదిగా ఎడమ వైపుకు వంగుము.ఎడమ అర చేతిని సాధ్యమైనంత వరకు ఎడమ కాలి మీదుగా క్రిందకు పోనిమ్ము.కుడి చేయ్యి మణికట్టు వద్దను మోచేయ్యి వద్దను వంగరాదు. మోకాళ్ళు తిన్నగా ఉంచవలెను. ఉచ్చ స్థితిలో ఊపిరిని మాములుగా ఉంచుము.30 సెకనులు అలానే వుంచాలి.

7. తిరిగి 1 వ గతికి రావాలి.

8. 4 వ స్థితికి తిరిగి వెళ్ళండి.

9. కుడి వైపుకు వంగుచు, ఎడమ ప్రక్కకు ఇదేవిధంగా చేయవలెను

ప్రయోజనాలు:

1. ఊపిరితిత్తులకు బలం చేకూరును.

2. పార్శ్వ కదలికల వలన వెన్నుముక సడలి,శక్తివంతగమగును

3. కాలేయము యొక్క కార్యం వృద్ధిపరుచును.

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.