ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న‌ కారు: ఆరుగురు మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న ప్ర‌మాదంలో ఆరుగురు మృతి చెందిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదం సోమవారం అర్ధరాతి 2 గంటలకు ఆగ్రా-ముంబ‌యి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

పోలీసుల క‌థ‌నం మేర‌కు… లావాడియా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తలవాలిచందా వద్ద పెట్రోల్ పంప్ ముందు ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ ఆగి ఉంది. ఈ ట్యాంక‌ర్‌ను గ‌మ‌నించ‌కుండా దేవాస్ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఇద్ద‌రు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. కాగా మృతులంతా విద్యార్థులే. ప్రమాదం జరిగిన సమయంలో వీరంతా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.