మహారాష్ట్రలో కొత్తగా 10,187 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకీ విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,187 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా రాష్ట్రంలో కరోనాతో 47 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 22,08,586కు చేరింది. కాగా తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 52,440కు చేరింది. అలాగే గత 24 గంటల్లో 6,080 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు.