దేశంలో కొత్త‌గా 18,711 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. తాజాగా క‌రోనా వైర‌స్ మూలంగా 100 మంది మ‌ర‌ణించారు. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా 14,392 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,12,10,799 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి నుంచి 1,08,68,520 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అలాగే మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,57,756కు చేరింది. ప్ర‌స్తుతం క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,84,523గా ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

 

Leave A Reply

Your email address will not be published.