విశాఖ ఉక్కు ఉద్య‌మంపై చిరంజీవి ట్వీట్‌

హైద‌రాబాద్‌: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మద్దతు ప్రకటించారు. ఉక్కు సంక‌ల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామ‌ని పిలుపునిచ్చారు. తాను విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. హ‌ర్త‌ళ్లు, ధ‌ర్నాలు, రిలే నిరాహార దీక్ష‌లు చేశాం. దాదాపు 35 మంది పౌరుల‌తో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్ప‌ణ చేసిన ఆనాటి మ‌హోద్య‌మ త్యాగాల ఫ‌లితంగా సాకార‌మైన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ఉత్ప‌త్తి ప్రారంభ‌మైన‌ప్పుడు అంద‌రం సంబ‌రాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హ‌క్కుగా, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌గా భావించి సంతోషించాం.

`విశాఖ ఉక్కు క‌ర్మాగారిని ఇన్నేళ్ల‌యినా క్యాప్టిన్ గ‌నులు కేటాయించ‌క‌పోవ‌డం. న‌ష్టాలు నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం.. అని చిరంజీవి పిలుపునిచ్చారు.

 

Leave A Reply

Your email address will not be published.