వకీల్ సాబ్: `కంటిపాప` ఫుల్ సాంగ్ వచ్చేసింది..

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్‌సాబ్’‌. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన రెండు పాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఎస్‌.ఎస్‌ తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ వకీల్‌సాబ్ నుంచి కంటిపాప సాంగ్‌ను విడుద‌ల చేశారు. ‘కంటిపాప కంటిపాప చెప్ప‌నైన లేదే..నువ్వంత‌లా అలా చెప్ప‌నైనలేదే..నువ్వంత‌లా అలా ఎన్ని క‌ల‌లు క‌న్నా..కాలి మువ్వ కాలి మువ్వ సవ్వ‌డైన లేదే’ అంటూ శృతిహాస‌న్‌, ప‌వ‌న్ మ‌ధ్య సాగే ట్రాక్‌ మ్యూజిక్ ల‌వ‌ర్స్ కు క‌నువిందు చేస్తోంది.

రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను ఎస్ థ‌మ‌న్‌, అర్మాన్ మాలిక్‌,దీపు, గీతా మాధురి పాడారు. ఎస్ థ‌మ‌న్ కంపోజ్ చేసిన మ‌గువా మ‌గువా, స‌త్య‌మేవ జ‌య‌తే పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇక బాలీవుడ్‌లో హిట్‌ సాధించిన పింక్‌ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుండగా.. తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది.

 

Leave A Reply

Your email address will not be published.