మహారాష్ట్రలో కొత్తగా 23,179 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిఅఓ కొత్తగా 23,179 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,70,507కు పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 84 మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 53,080కు చేరింది. కేవలం దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో 2,377 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు రాష్ట్రంలో 9,138 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,63,391కు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,52,760 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.