నాలుగో రౌండ్లోనూ కొనసాగిన పల్లా ఆధిక్యం
నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో నాల్గొవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాల్గొవ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 15,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం నాలుగు రౌండ్లలో రౌండ్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 63,442 ఓట్లు. తీన్మార్ మల్లన్నకు 48,004, కోదండరామ్‌కు 39,615, ప్రేమేందర్‌రెడ్డి(బీజేపీ)కి 23,703, రాములు నాయక్(కాంగ్రెస్)కు 15,934 ఓట్లు రాగా.. నాలుగు రౌండ్లలో చెల్లని ఓట్లు 12,475. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
నాల్గొవ రౌండ్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 17,100 ఓట్లు పోలవ్వగా సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 13,500, ప్రొఫెసర్ కొందరామ్కు 11,917, ప్రేమేందర్‌రెడ్డి(బీజేపీ)కి 5,099, రాములు నాయక్(కాంగ్రెస్)కు 4,003 ఓట్లు పోలయ్యాయి. చెల్లని ఓట్లు 3,223. ఈ నాలుగో రౌండ్లో పల్లాకు 3,600 ఓట్ల ఆధిక్యం లభించింది.
[…] నాలుగో రౌండ్లోనూ కొనసాగిన పల్లా ఆధి… […]