నాలుగో రౌండ్‌లోనూ వాణీదేవి ఆధిక్యం

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు నాలుగో రౌండు పూర్తి కాగా టిఆర్ ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవి ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అలాగే నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 18,549 ఓట్ల ఆధిక్యత లభించింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి టిఆర్ ఎస్ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవి స‌మీప అభ్య‌ర్థి రాంచంద‌ర్‌రావు పై 5,553 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగో రౌండ్ ముగిసే స‌రికి వాణీదేవికి 70,552 ఓట్లు, రాంచంద‌ర్ రావుకు 64,999 ఓట్లు, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌కు 34,029 ఓట్లు, చిన్నారెడ్డికి 20,053 ఓట్లు వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 13,364 చెల్ల‌ని ఓట్లు గుర్తించారు.

అలాగే నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 18,549 ఓట్ల ఆధిక్యత లభించింది. దీంతో పల్లాకు పోలైన మొత్తం ఓట్లు 79,113. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అతనికి 60,564 ఓట్లు వచ్చాయి. ఇక, మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఆయనకు 49,200 ఓట్లు పోలయ్యాయి. మొత్తం చెల్లని ఓట్లు 15, 533. ఇక్క‌డ 71 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.

(ఐదో రౌండు: `పల్లా`కి 18,549 ఓట్ల ఆధిక్యత)

Leave A Reply

Your email address will not be published.