హైకోర్టులో కెసిఆర్‌, హ‌రీష్‌కు ఊర‌ట‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తెలంగాణ హైకోర్టు బుధ‌వారం తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో బిఆర్ ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, మాజీ మంత్రి హ‌రీష్ రావుకు హైకోర్టు ఊర‌ట క‌ల్పించింది.

ప్రాజెక్టు అవ‌క‌త‌వ‌క‌ల‌పై నియ‌మించిన జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్ ఎలాంటి నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని అత్యున్న‌త ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. క‌మిష‌న్ నివేదిక ఆధారంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరాదంటూ హైకోర్టు ఆదేశించింది.

కెసిఆర్ ప్ర‌భుత్వం హ‌యాంలో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విచార‌ణ కోసం జ‌స్టిస్ పిసి ఘోష్ క‌మిష‌న్‌ను నియ‌మిస్తూ గ‌త యేడాది మార్చి 14న జారీ చేసిన జి.ఒ నం. 6ను స‌వాలు చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి టి హ‌రీష్‌రావు, ఐఎఎస్‌ అధికారులు స్మితా స‌బ‌ర్వాల్‌, ఎకె జోషిలు వేర్వేరుగా దాఖ‌లు చేసిన ప‌టిష‌న్ల‌పై సిజె జ‌స్టిస్ అప‌రేష్ కుమార్ సింగ్‌, జ‌స్టిస్ జి.ఎం మొహియుద్దీన్‌ల ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం నేడు తీర్పును వెలువ‌రించింది. ఈ తీర్పులో మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి టి హ‌రీష్‌రావు, ఐఎఎస్‌ అధికారులు స్మితా స‌బ‌ర్వాల్‌, ఎకె జోషిలకు ఊర‌ట క‌ల్పించింది.

Also Read: మార్పు కోసం నా అక్షరాలు

Leave A Reply

Your email address will not be published.