రేపు ఎపి ఇంట‌ర్ ఫ‌లితాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేపు ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌కానున్నాయి. రేపు ఉద‌యం 10.31 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.  ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ఫ‌లితాల‌ను బుధ‌వారం విడుద‌ల చేయ‌నున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదిక‌గా తెలిపారు. ఫ‌లితాల‌ను https://resultsbie.ap.gov.in లోనూ , మ‌న‌మిత్ర ద్వారా వాట్స‌ప్‌లోనూ (9552300009) పొంద‌వ‌చ్చు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 23 నుండి మార్చి 23 వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వహించిన విష‌యం తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.