యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్

కామారెడ్డి (CLiC2NEWS): పట్టణంలోని యశోద ఆసుప‌త్రిలో యూరాలజిస్ట్ వైద్యులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ.. మన జనాభాలో సరాసరి 5% మందికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అన్నారు. కాగా ఆ రాళ్ల‌ను మొదటి దశలోనే గుర్తించి వైద్యం అందిస్తే ఆపరేషన్ వరకు వెళ్లే అవసరం లేకుండానే న‌యం చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

యశోద ఆసుపత్రిలో అత్యంత నాణ్యమైన వైద్య పరికరాలు రోబోటిక్ ఎక్స్రేలు అందుబాటులో ఉన్నాయని డాక్ట‌ర్ తెలిపారు. ప్ర‌పంచ దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్ కు సంబంధించిన రోబోటిక్ వైద్య పరీక్షలు యశోద హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని గోపీ చంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ యశోద సిబ్బంది పాల్గొన్నారు.

Also Read:  హైకోర్టులో కెసిఆర్‌, హ‌రీష్‌కు ఊర‌ట‌

Leave A Reply

Your email address will not be published.