ఇంట‌ర్ తో కేంద్రంలో స్టెనోగ్రాఫ‌ర్ ఉద్యోగాలు

SSC: ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన వివిధ కార్యాల‌యాల్లో స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్ సి , గ్రేడ్ డి పోస్టుల‌కు ఎంపికైన వారికి మొద‌టి నెల నుండే సుమారు రూ. 50వేలు వేత‌నంతో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు కూడా పొంద‌వ‌చ్చు.

స్టెనో గ్రాఫీలో ఇప్ప‌టి వ‌ర‌కు అనుభ‌వం లేని వారు.. ఇప్ప‌టి నుండి ప్ర‌తి రోజూ ప్రాక్టీస్ చేస్తే విజ‌యం సాధించ‌వ‌చ్చు.

 

మొత్తం ఖాళీలు 731

స్టెనో గ్రాఫ‌ర్ గ్రేడ్ సి పోస్టుల‌కు ఆగ‌స్టు 1, 2026 నాటికి 18 నుండి 30 ఏళ్ల లోపు ఉండాలి.

స్టెనో గ్రాఫ‌ర్ గ్రేడ్ డి పోస్టుల‌కు ఆగ‌స్టు 1, 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల లోపు వారు అర్హులు.

ద‌ర‌ఖాస్తుల‌ను మే 15లోపు పంపించాల్సి ఉంది.
పరీక్ష‌లు జులై-ఆగ‌స్టులో నిర్వ‌హించ‌వ‌చ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రీక్ష కేంద్రాలు.. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌,కాకినాడ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, విజ‌య‌వాడ‌, ఏలూరు, గుంటూరు, క‌ర్నూలు, తిరుప‌తి.

తెలంగాణ రాష్ట్రంలో హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ , సిద్దిపేట‌.

ముందుగా ఆన్‌లైన్ ప‌రీక్ష ఉంటుంది. మొత్తం 200 మార్క‌కుల‌కు ఇంగ్లీష్ , హిందీ భాష‌లో ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఈ ప‌రీక్ష‌ను 2 గంటల్లో పూర్తి చేయాలి.

జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్ -50 ప్ర‌శ్న‌లు

జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ 50 ప్ర‌శ్న‌లు

ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్ర‌హెన్ష‌న్ 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి.

త‌ప్పు స‌మాధానానికి పావు మార్కు త‌గ్గిస్తారు.

స్కిల్ టెస్ట్‌

ఆన్‌లైన్ ప‌రీక్ష‌లో క్వాలిఫై ఐన వారికి స్కిల్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

ఈ రెండు ప‌రీక్ష‌ల ఆధారంగా మెరిట్ , రిజ‌ర్వేష‌న్ ప్రాతిప‌దిక‌న నియామ‌కాలు ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.