ట్రైబల్ వెల్ఫేర్‌పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి
వరంగల్- కాకతీయ యూనివర్సిటీ (CLiC2NEWS): గిరిజన సంక్షేమంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో డా. చైతన్య కుమారి రచించిన “Public Policy and Tribal Welfare” పుస్తకాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య యాదగిరితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రొ. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించిన ప్రజా విధానాలను మరింత లోతుగా అధ్యయనం చేయడం అవసరమని తెలిపారు. గిరిజన సంక్షేమం కోసం జరిగే పరిశోధనలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా చేస్తాయని చెప్పారు.

డా. చైతన్య కుమారి ఈ పుస్తకం ద్వారా విధాన రూపకర్తలకు, పరిశోధకులకు ఉపయోగకరమైన సమాచారం అందించారని అభినందించారు. గిరిజన సంక్షేమంపై ఆమె చేసిన కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని పరిశోధనలు చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, రాజకీయ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య సంకినేని వెంకటయ్య, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డా. జి. కృష్ణయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్