పోలీసులకు సవాల్ గా మారిన బ్యాంకు చోరీ కేసు!
మంథని: పెద్దపెల్లి జిల్లాలో గుంజపడుగు ఎస్.బి.ఐ.బ్యాంకు చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. గుంజపడుగు గ్రామంలోని ఎస్.బి.ఐ.బ్యాంకులో ప్లాన్ ప్రకారం దొంగతనం చేశారు. బ్యాంకులో 18 లక్షల 40 వేల నగదుతో పాటు, 6 కిలోల బంగారం చోరీ చేశారు. వీటి మొత్తం విలువ మూడు కోట్ల పది లక్షలు ఉంటుంది అని తెలిపారు. ఈ పని చేసింది మహారాష్ట్రకు చెందిన వారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు లేకుండా సిసి కెమెరాలు, డీవీఆర్, హార్డ్ డిస్క్ లను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు 8 బృందాలతో దొంగలకోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ, ఓఎస్డీ శరత్ పవార్, డిసీపీ రవీందర్ తో పాటు పోలీసు అధికారులు పరిశీలించారు.
