కొవిడ్ వ్యాక్సిన్ 2వ డోసు తీసుకున్న స్పీక‌ర్ పోచారం

హైద‌రాబాద్: తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి బుధ‌వారం నిమ్స్‌లో కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. స్పీక‌ర్, చైర్మ‌న్ల స‌తీమ‌ణులు పుష్ప‌, అరుంధ‌తి కూడా టీకా తీసుకున్నారు. మార్చి 3వ తేదీన వీరు మొద‌టి డోసు తీసుకున్నారు.

టీకా తీసుకున్న సంద‌ర్భంగా స్పీక‌ర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా టీకా విష‌యంలో ఎవ‌రూ అపోహ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ టీకా తీసుకోవాల‌ని కోరారు. రాష్ర్ట ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా 45 సంవత్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌న్నారు. మాస్క్ ధ‌రించకపోతే రూ. 1000 జరిమానా, 2 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తారు. ఈ కఠిన నిబంధ‌నలు మన మేలు కోసమే, ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలి అని స్పీక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.