యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా విద్యార్థుల‌తో యోగా కార్య‌క్ర‌మం

Khammam (CLiC2NEWS): 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో ZPHS మరియు MPPS నందు యోగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కొత్తగూడెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి కృష్ణకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగాచార్యులు షేక్ బహార్ అలీ గారు విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు ప్రాణయామము ధ్యానము ప్రోటోకాల్ ద్వారా చేయించడం జరిగింది. పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కొరకు ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో టీచర్ నాగేశ్వరరావు గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, సహా ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.