కోచింగ్ సెంట‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 15 మంది మృతి

ల‌ఖ్‌న‌వూ (CLiC2NEWS): ఓ కోచింగ్ సెంట‌ర్ భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌ఖ్‌న‌వూ లోని ఓ కోచింగ్ సెంట‌ర్‌లో జ‌రిగింది. భ‌వ‌నం కింది అంత‌స్తులో అంటుకున్న మంట‌లు.. పై అంత‌స్తుకి ఎగ‌బాక‌టంతో భ‌వ‌నమంతా మంట‌ల్లో చిక్కుకుపోయింది. పై అంత‌స్తులో ఉన్న కోచింగ్ సెంట‌ర్లో ద‌ట్ట మైన పొగ‌ల‌తో కూడిన మంట‌లు వ్యాపించ‌డంతో అక్క‌డ ఉన్న విద్యార్థులంతా త‌న ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌రుగులు తీశారు. కానీ.. మంట‌లు భారీ ఉండ‌టంతో కొంత‌మంది భ‌వ‌నం పైనుండి కిందికి దూకేశారు. ఈ ప్ర‌మాదంలో 15 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రికొంద‌రు తీవ్ర‌గాయాల‌తో చికిత్స‌పొంద‌తున్నారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌నా స్థ‌లానికి ఫైర్ ఇంజిన్లు అర‌గంట త‌ర్వాత వ‌చ్చాయ‌ని , అందుకే ప్ర‌మాదం తీవ్రంగా ఉంద‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్ర‌మాద స‌మాచారం తెలుసుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. కేంద్రప్ర‌భుత్వం త‌ర‌పునుం0డి రూ.2ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. అదేవిధంగా గాయ‌ప‌డిన వారికి రూ.50వేల చొప్పున అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Leave A Reply

Your email address will not be published.