అమెరికాలో `వకీల్ సాబ్` రికార్డు కలెక్షన్స్

ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెండి తెర‌పై క‌నిపించ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ యూఎస్ ప్రీమియర్స్ లో సత్తా చాటింది. ఒక‌రోజు ముందుగానే భారీ అంచనాలతో ఓవర్సీస్ లో విడుదలైన ‘వకీల్ సాబ్’ ప్రీమియర్ల ద్వారా మొదటిరోజే రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో దూసుకెళ్లాడు.

ఒకవైపు కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నా.. అది ‘వకీల్ సాబ్’పై ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం. యూఎస్ఏలో వ‌కీల్ సాబ్ దాదాపు 226 థియేటర్లలో విడుదలై, ప్రీమియర్ షోల ద్వారా 300K డాలర్లను వసూలు చేసింది. ఈ సంవత్సరం ప్రీమియర్ షో రోజున భారీగా వసూళ్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా సరికొత్త రికార్డును సృష్టించాడు ‘వకీల్ సాబ్’.

ఇటీవల విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ ‘జాతిరత్నాలు’ ప్రీమియర్ షో రోజున 132K డాలర్లు వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ విడుదల సమయంలో యుఎస్ఎలోని థియేటర్లలో ఆక్యుపెన్సీపై పరిమితులు ఉన్నప్పటికీ `వ‌కీల్‌సాబ్‌` రికార్డు బ్రేక్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించిన నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు.

Leave A Reply

Your email address will not be published.