అంబులెన్స్ ను ప్రారంభించిన ఎంపి బోర్లకుంట వెంకటేష్
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో కరోన విపత్కర పరిస్థితుల్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడాలని అంబులెన్స్ ను శనివారం ఎంపి వెంకటేష్ నేత ప్రారంభించారు. వెంటిలేటర్ అధునాతన సదుపాయాలతో కూడిన ఒక్కో అంబులెన్సుకు దాదాపు 30,34,000 (అక్షరాల ముప్పైలక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు)ల వ్యయంతో రెండు జిల్లాలకు 2అంబులెన్సులని సమకూర్చారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాకి సంభందించిన అంబులెన్సుని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ అదునితన సదుపాయాలతో వెంటిలేటర్ తో కూడిన ఈ అంబులెన్సుని జిల్లా ప్రజలంతా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సర్వే సంగీతసత్యనారాయణ, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా హాస్పిటల్ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.