భగత్‌ను గెలిపించాలి: ఆర్.కృష్ణయ్య
నల్లగొండ: నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నకలో తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. హాలియాలో బీసీ, ఎంబీసీలకు చెందిన 40 సంఘాలు శనివారం నిర్వహించిన సమావేశానికి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నోముల నర్సింహయ్య చివరి శ్వాస వరకు ప్రజల కోసం తపించారు అని కృష్ణయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో నోముల వారసుడు భగత్‌కు టికెట్ ఇచ్చారు. భగత్‌ను గెలిపించాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఉందన్నారు. బీసీలు ఐక్యంగా ఉండి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు.