పెద్దపెల్లి: ఘనంగా అంబేడ్కర్ జయంతి
మంథని: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడకలు పెద్దపెల్లి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు చోట్ల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులలర్పించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, పలు సంఘాల నాయకులు, తదితరులు అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మంథనిలో
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంథనిలో అంబేద్కర్ చౌరస్తా విగ్రహం వద్ద జడ్పీ చైర్మన్ పుట్ట మధు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కరనా కట్టడికోసం ప్రజలు సహకారించాలని కోరారు. ఈ సందర్భంగా మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, మంథని ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత, మంథని ఏఎంసీ చైర్మన్ రాంభట్ల సంతోషిని, తదితర నాయకులు పాల్గొన్నారు.

గోదావరిఖనిలో..
అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గోదారిఖనిలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, 37 వ వార్డు కార్పొరేటర్ పెంటరాజేష్ తదితరలు.

రామగుండంలో..
రామగుండం మున్సిపల్ చౌరస్తా వద్ద రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ లు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంథనిలో..
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130 వ జయంతి వేడుకను బుధవారం మంథని బార్ అసోసియేషన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంథని బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రమణ కుమార్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ రఘోత్తమ్ రెడ్డి, చిగురు శ్రీనివాస్, న్యాయవాదులు ఆంజనేయులు, విజయ్ కుమార్, శివ నాగరాజు, శ్రీహరి, పారనంది సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఓదెలలో…
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఓదెల మండలం కొమిరె గ్రామంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘము ప్రెసిడెంట్ రాచర్ల రాజు అద్వర్యం 30 మంది యువకులు అవయవ దానం ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమ మహేశ్వరి సాగర్ రెడ్డి చేతుల మీదుగా ID కార్డులు తీసుకున్నారు. మిట్టపల్లి వెంకటేష్, ప్రశాంత్మ హిపాల్, G. రాజు. T. రాజు ID కార్డులు తీసుకున్నారు.