ఎపిలో కొత్తగా 4,157 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,37,049 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,606 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 901327 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 28,383 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,339 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు.